రివ్యూ : యుద్ధం శరణం - రొటీన్ యుద్ధం


నాగచైతన్య , లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్ తదితరులు.
కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు
రజని కొర్రపాటి
వివేక్ సాగర్
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందించిన చిత్రం `యుద్ధం శరణం`. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ప్రేమమ్ , రారండో వేడుక చూద్దాం హిట్స్ తర్వాత చైతు నుండి వస్తున్న మూవీ కావడం తో ఈ సినిమా ఫై అక్కినేని అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను చైతు ఏ మేరకు అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
అర్జున్ (నాగచైతన్య) తన తల్లిదండ్రులు (రావు రమేశ్‌, రేవతి) లతో హ్యాపీ గా గడుపుతుంటాడు. అర్జున్ డ్రోన్ డిజైనింగ్ గా పనిచేస్తుంటాడు. తన తల్లిదండ్రులు మాత్రం వృత్తి రీత్యా డాక్టర్స్ కావడం తో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తుంటారు. వారికీ ఇంటర్న్ షిప్ చేయాలని వారిదగ్గరికి వచ్చిన అంజలి (లావణ్య త్రిపాఠి ) ను చూసి అర్జున్ ప్రేమలో పడతాడు. కొడుకు ప్రేమకు తల్లిదండ్రులు కూడా ఒకే చెపుతారు..అంత హ్యాపీ అనుకునే టైం లో అర్జున్ తల్లిదండ్రులు చనిపోతారు. వారి చావుకు ఓ రాజకీయ నాయకుడి స్వార్థం ఉంటుందని అర్జున్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత అర్జున్ అతడి ఫై ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా..? అసలు అర్జున్ తల్లిదండ్రులను చంపాల్సిన అవసరం అతడికే ఏంటి..? అర్జున్, అంజలి ప్రేమ ఏమవుతుంది..? అనే విషయాలు మీరు తెర ఫై చూడాల్సిందే.
* నాగ చైతన్య - లావణ్య లవ్ ట్రాక్
* ఫస్ట్ హాఫ్
* ప్రియదర్శి కామెడీ
* కథ
* సన్నివేశాల సాగదీత
* మ్యూజిక్
* ప్రేమకథల్లోనే ఎక్కువగా కనిపించిన నాగచైతన్య ఈమధ్య వైవిధ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన శైలి కథల్లోనే యాక్షన్‌ ఉండేలా చూసుకొంటున్నారు. ఇప్పటికే `రారండోయ్ వేడుకచూద్దాం`తో సందడి చేసిన నాగచైతన్య, ఈ మూవీ లో కూడా తనదయిన నటన ను కనపరిచాడు. తన తల్లిదండ్రులను చంపిన రాజకీయ నాయకుడి ఫై ప్రతీకారం తీసుకునే యువకుడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు.
* చదువుకున్న చక్కటి ఇల్లాలిగా, భర్త అభిప్రాయాలను గౌరవించే భార్యగా, చక్కటి తల్లిగా, సమాజ శ్రేయస్సును కాంక్షించే వ్యక్తిగా రేవతి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొడుకుతో తండ్రికుండే అనుబంధం గురించి రావు రమేశ్ చెప్పే మాటలు బాగా ఆకర్షిస్తాయి.
* లావణ్య త్రిపాఠి గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. ఈమె పాత్ర మొదటి భాగానికే పరిమితం అయ్యింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ మాత్రమే కనిపించింది.
* 'పెళ్లిచూపులు'తో ఆకట్టుకున్న ప్రియదర్శి , మరోసారి ఈ మూవీ లో తనదయిన కామెడీ ని పండించి నవ్వులు తెప్పించాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఇతడిని వాడుకుంటే బాగుండు.
* చైతు అక్కచెల్లెల్లుగా నటించిన వారు ఇద్దరూ కొత్తవారే అయినా బాగానే నటించారు.
* శ్రీకాంత్ మరోసారి ప్రతినాయకుడు పాత్ర లో ఆకట్టుకున్నాడు. కాకపోతే ఈయనకు బలమైన సన్నివేశాలు పడకపోయేసరికి కాస్త తక్కువే అనిపించాడు.
* చాల రోజుల తర్వాత హీరో వినోద్ కుమార్ విలన్ రోల్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
* ఇక మిగిలిన నటి నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
* డేవిడ్ ఆర్.నాథన్ కథ పెద్దగా అనిపించలేకపోయింది. గతంలో చైతు చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' ను గుర్తు చేసింది.
* వివేక్ సాగర్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రం గానే ఉంది.
* నికేత్ బొమ్మి సినిమా ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో అదొకటి. సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడతను.
* రజని కొర్రపాటి నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
* కృష్ణ మారిముత్తు కథను తెరకెక్కించడం లో విఫలం అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంత ప్రేమానురాగాలతో సాగించాడు కానీ సెకండ్ వచ్చేసరికి పూర్తిగా ప్రతీకారానికే వదిలేసాడు. చాల చోట్ల లాజిక్స్ మిస్ చేసాడు. అటు రాజకీయనాయకుడిగా చేసిన వినోద్ కుమార్‌గానీ, ఇటు నాయక్‌గా నటించిన శ్రీకాంత్ పాత్రలు కానీ బలంగా చూపించలేకపోయాడు. అలాగే సన్నివేశాల్లో బాగా సాగదీత ఉండడం తో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.
ప్రేమమ్ , రారండో వేడుక చూద్దాం చిత్రాల తర్వాత చైతు నుండి సినిమా రావడం , అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం తో సినిమా ఫై అంచనాలు పెంచేసుకున్నారు సినీ ప్రేక్షకులు కానీ వారి అంచనాలు అందుకోవడం లో దర్శకుడు నిరాశ పరిచాడు. కథ లో కొత్తదనం లేకపోవడం , మ్యూజిక్ వర్క్ అవుట్ కాకపోవడం , సన్నివేశాల్లో సాగదీత ఎక్కువగా ఉండడం , కథనం తో సినిమా నడిపించడం వల్ల జనాలకు ఎంత మేరకు నచ్చుతుంది అనేది ప్రశ్న. ఓవరాల్ గా 'యుద్ధం శరణం - రొటీన్ యుద్ధం '.

Comments