ఇండిపెండెన్స్ డేకి పవన్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడా..?

ఈ ఇండిపెండెన్స్ డే కు సినీ అభిమానులు మరింత పండగా చేసుకోబోతున్నారు..తమ అభిమాన హీరోలంతా తమ తమ సినిమాల ఫస్ట్ లుక్ టీజర్ల తో , ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు..ఇప్పటికే ఎన్టీఆర్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ రెడీ అవ్వగా తాజాగా వారి లిస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నాడని వినికిడి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే మూడు వంతుల షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఈ నేపథ్యం లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇండిపెండెన్స్ డే సందర్భాంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఆ ఫస్ట్ లుక్ ఫై ఓక్లారిటీ ఇచ్చారట.

జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , అది కూడా పవన్ 25 వ చిత్రం కావడం తో అభిమానుల్లోనే కాక చిత్ర పరిశ్రమ లో ఈ మూవీ ఫై భారీ గా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్ , అను ఏమ్మన్యుల్ జోడి కడుతున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించ బడుతుంది.


Comments