పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న కొత్తసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరిద్దరిదీ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో పవన్ సరసన అనుఇమ్మానుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజ్ న్యూస్ బయటకు వదిలింది చిత్రయూనిట్. చిత్రం ఫస్ట్‌లుక్‌ని సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ‘పిఎస్‌పికే 25th ఫస్ట్‌లుక్ ఆన్ 2nd సెప్టెంబర్’ అని కేవలం కళ్ళజోడు మాత్రమే ఉన్న పోస్టర్‌ని విడుదలచేశారు. అంతేకాదు ‘స్టార్ట్ ది మ్యాజిక్..’ అని టాగ్ చేసి పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రానికి ‘రాజు వచ్చినాడు’, ‘గోపాలకృష్ణుడు’, ‘ఇంజినీర్ బాబు’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే..
Comments
Post a Comment