సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పైసా వసూల్’

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా… పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్‌’… ఇప్పటికే స్టంపర్‌, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్… బాలయ్య చెప్పిన డైలాగ్స్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది… సెన్సార్ బోర్డ్ ‘పైసా వసూల్‌’కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి అభిమానులు కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి నిర్మాత ఆనందప్రసాద్… ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ ని బాలయ్య అద్భుతంగా పోషించారు. డూప్ లేకుండా ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయని తెలిపారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వెనిగళ్ల ఆనంద్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… బాలయ్య సరసన శ్రీయా, ముస్కాన్‌, ఖైరా దత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూర్చారు.

Comments